స్టోరీ మిర్రర్ భారత దేశపు అతి పెద్ద డిజిటల్ ప్రచురణ వేదిక. స్టోరీ మిర్రర్ తమ రచనలతో ఈ వేదికను అత్యంత సుసంపన్నం చేసిన రచయితలను సత్కరించి కృతజ్ఞత చెప్పుకునే ఉద్దేశ్యంతో స్టోరీ మిర్రర్ ఆథర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, సీజన్ 5 ను ప్రకటిస్తోంది.
రచయితలు తమ ప్రతిభా పాటవాలు కనబరిచి అత్యద్భుతమైన రీతిలో పాఠకుల మనసులో చెరగని ముద్ర వేశారు. వారి ప్రతిభను, అత్యద్భుతమైన వారి కృషిని స్టోరీ మిర్రర్ అభినందిస్తోంది.
గతంలో మాదిరి కాకుండా స్టోరీ మిర్రర్ ఆథర్ ఆఫ్ ది ఇయర్ సీజన్ 5 ను ఒక ప్రత్యక్ష వేడుకగా జరపాలని స్టోరీ మిర్రర్ ఆశిస్తోంది.
స్టోరీ మిర్రర్ ఆథర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డులు
స్టోరీ మిర్రర్ ఆథర్ ఆఫ్ ది ఇయర్ 2022 రీడర్స్ చాయిస్
పాఠకుల ఆదరణ ఆధారంగా అత్యధిక లైకులు, కామెంట్లు పొందిన రచయితలకు ఈ అవార్డ్ ఇవ్వబడుతుంది.
మొత్తం రచయితలలో 2 శాతం మందికి మాత్రమే ఈ అవార్డుకు నామినేట్ చేయటం జరుగుతుంది.
స్టోరీ మిర్రర్ ఆథర్ ఆఫ్ ది ఇయర్ 2022 ఎడిటర్స్ చాయిస్
స్టోరీ మిర్రర్ లో అత్యధిక రచనలు ప్రచురణ చేసి, మంచి ఎడిటర్ స్కోర్ పొందిన రచనలకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. ఈ బృందంలో స్టోరీ మిర్రర్ సీఈఓ బిభు దత్త రౌత్, చీఫ్ ఎడిటర్ దివ్య మీర్ చందానీ గార్లు ఇంకా కొందరు జురీ సభ్యులు ఉంటారు.
రివార్డులు
ఈ క్రింది రివార్డులు విజేతలకు అందజేయబడతాయి.
ప్రతి భాషలో స్టోరీ మిర్రర్ ఆథర్ ఆఫ్ ది ఇయర్ రీడర్స్ చాయిస్, ఎడిటర్స్ చాయిస్ విజేతకు ట్రోఫీ, సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
స్టోరీ మిర్రర్ ఆథర్ ఆఫ్ ది ఇయర్ రీడర్స్ చాయిస్, ఎడిటర్స్ చాయిస్ మొదటి రన్నరప్ కు ట్రోఫీ, సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
స్టోరీ మిర్రర్ ఆథర్ ఆఫ్ ది ఇయర్ రీడర్స్ చాయిస్, ఎడిటర్స్ చాయిస్రెండో రన్నరప్ కు సర్టిఫికేట్, ట్రోఫీ అందజేయబడతాయి.
ప్రతి భాషలో టాప్ 5 రచయితలకు స్టోరీ మిర్రర్ వారి ద్వారా ఉచితంగా పుస్తకం ప్రచురణ చేసుకునే అవకాశం లభిస్తుంది.(షరతులు వర్తిస్తాయి)
ప్రతి భాషలో టాప్ 10 రచయితలకి, ఎక్కువ క్లాప్ సంఖ్య ఆధారంగా స్టోరీ మిర్రర్ ద్వారా ఉచితంగా ఈ బుక్, సర్టిఫికేట్, స్టోరీ మిర్రర్ నిబంధనల ఆధారంగా పేపర్ బాక్ పుస్తకం 40 శాతం డిస్కౌంట్ తో ప్రచురణ చేసుకునే అవకాశం లభిస్తుంది.
100 కన్నా ఎక్కువ క్లాప్ పొందిన రచయితలకు 500 రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది.
50 కన్నా ఎక్కువ క్లాప్స్ పొందిన రచయితలకు 250 రూపాయల డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది.
25 కన్నా ఎక్కువ క్లాప్స్ పొందిన రచయితలకు 149 రూపాయల డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది.
మెగా బహుమతి అత్యధిక క్లాప్స్ పొందిన రచయిత ఒకరికి స్టోరీ మిర్రర్ పబ్లిషింగ్ కాంట్రాక్ట్ ఇవ్వబడుతుంది.
వారం వారం బహుమతులు
ప్రతి వారం అత్యధిక క్లాప్స్ పొందిన రచయితలకు 300 రూపాయల విలువ గల పుస్తకం బహుమతిగా లభిస్తుంది. జనవరి 1-7,8-14,15-21, 22-28 తేదీల మధ్య క్లాప్ సంఖ్య పరిగణన లోకి తీసుకుంటాము.
అదనపు బహుమతులు
ఈ క్రింది విభాగాల రచయితలకు ఒక మెడల్,సర్టిఫికెట్ అందజేస్తాం.
మోస్ట్ కన్సిస్టెంట్ రైటర్ ఆఫ్ ది ఇయర్:
2022 లో అత్యధిక రచనలు పంపిన రచయితలు( కథ,కవిత, ఆడియో) జనవరి 1,2022 నుండి డిసెంబర్ 31,2022 వరకు ప్రతి నెల.
మోస్ట్ ప్రోలిఫైక్ రైటర్ ఆఫ్ ది ఇయర్ :
2022 లో అత్యధిక రచనలు పంపిన రచయితలు( కథ,కవిత, ఆడియో), 2022 ఏడాది మొత్తానికి.
పోయెట్ ఆఫ్ ది ఇయర్:
2022 లో ఏడాది మొత్తంలో అత్యధిక ఎడిటర్ స్కోర్, 25 కవితలు పంపిన కవికి ఈ అవార్డ్ ఇవ్వబడుతుంది.
స్టోరీ రైటర్ ఆఫ్ ది ఇయర్:
2022 లో ఏడాది మొత్తంలో అత్యధిక ఎడిటర్ స్కోర్, 15 కథలు పంపిన రచయితకి ఈ అవార్డ్ ఇవ్వబడుతుంది.
నారేటర్ ఆఫ్ ది ఇయర్:
అత్యధిక ఎడిటర్ స్కోర్ కలిగి, 2022 లో కనీసం 5 ఆడియో రచనలు పంపిన వారికి ఈ అవార్డ్ ఇవ్వబడుతుంది.
బెస్ట్ కోటర్ ఆఫ్ ది ఇయర్:
అత్యధిక సంఖ్యలో కొట్స్ పంపి, 2022 లో కనీసం 100 కొట్స్ పంపిన వారికి ఈ అవార్డ్ ఇవ్వబడుతుంది.
ఎమర్జింగ్ రైటర్ ఆఫ్ ది ఇయర్ :
2022 లో స్టోరీ మిర్రర్ కు రాయటం మొదలు పెట్టి, అత్యధిక ఎడిటర్ స్కోర్ కలిగి, స్టోరీ మిర్రర్ లో కనీసం 25 రచనలు పంపిన వారికి ఈ అవార్డ్ కు అర్హత లభిస్తుంది.
నియమ నిబంధనలు:
స్టోరీ మిర్రర్ అవార్డు కోసం ఫెక్ ఐడీ లేదా ఇతర తప్పుడు మార్గాల ద్వారా పొందే క్లాప్స్ ను పరిగణించము.ఆ మార్గాలు ఉపయోగిస్తే రచయితను అనర్హులు గా పరిగణిస్తాం.
ఈ - బుక్ లేదా పేపర్ బ్యాక్ ప్రచురణలు స్టోరీ మిర్రర్ వారి నియమ నిబంధనల ప్రకారం నిర్ణయించబడతాయి.
అవార్డుల ఎంపికలో స్టోరీ మిర్రర్ దే తుది నిర్ణయం. ఉత్తర ప్రత్యుత్తరాలు అనుమతించబడవు.
స్టోరీ మిర్రర్ ఆథర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రవర్తనా నియమావళి, నిబంధనలు మార్చే అవకాశం యాజమాన్యం నిర్ణయం ప్రకారం జరుగుతుంది.